వేవేల దూతలతో కొనియాడబడుచున్న

Vevela Dutalato Koniyadabaducunna

13 Jan 2026
వేవేల దూతలతో కొనియాడబడుచున్న నిత్యుడగు తండ్రి సమాధాన కర్త బలవంతుడైన దేవా ||వేవేల|| మా కొరకు నీ ప్రాణం సిలువలో త్యాగం నే మరువలేను నా దేవా || 2 || ఏమిచ్చి నీ ఋణము – నే తీర్చగలను || 2 || ఈ భువిలో నీ కొరకు ఏమివ్వగలను || 2 || ||వేవేల|| మా స్థితిని మా గతిని నీవు మార్చగలవు మా బాధలు మా వేదన నీవు తీర్చగలవు || 2 || ఎంత వేదనైనా – ఎంత శోధనైనా || 2 || మా కొరకు సిలువలో బలి అయినావు || 2 || ||వేవేల||