పరదేశి నా పేరే పరదేశి
Paradesi Na Pere Paradesi
Bro. Shalem Raju Garu
17 Dec 2025
పరదేశి నా పేరే పరదేశి
పరదేశి నా పేరే పరదేశి
నా ఊరే యెరూషలేము || 2 ||
యేసుని నమ్మిన నాటి నుండి నా వారే నాకు దూరముగా నిలిచే || 2 ||
సాగిపోతున్నా నా యేసుతో || 2 ||
సిలువ వేయబడితిని లోకానికి || 2 || || పరదేశి ||
యేసుని నమ్మని ఆ రోజులలో
పాపపు అంధుడనై కలలెన్నో కంటిని || 2 ||
కూలిపోయే గాలి మేడలు నా కొరకెన్నో కట్టించు కొంటిని || 2 ||
నాది కానీ ఈ లోకములో అంతా నాదని వ్యర్ధుడనైతిని || 2 ||
తిరిగి చూడగా యేసు నామమే మిగిలెనుగా || 2 ||
సాగిపోతున్న నా యేసుతో || పరదేశి ||
ఎవరో యేసు చూడాలనుకొనగా తానెవరో నాకు కనుపరుచు కొనెను || 2 ||
కంటిని ఆ ప్రభుని సిలువ దర్శనము తెరువబడిన కన్నులతో || 2 ||
ఎవ్వరు నా కొరకు ఇంత త్యాగము చేయుట ఎన్నడూ నే చూడలేదు || 2 ||
అంకితమైతిని ఆ ప్రేమ మూర్తికి || 2 ||
సాగిపోతున్న నా యేసు తోనే || పరదేశి ||
అంతము కానిది ఏసయ్య రాజ్యము అదే నూతన యెరూషలేము || 2 ||
అరణ్య జీవితమే దానికి మార్గము అపోస్తులుల బోధ దానికి గుమ్మములు || 2 ||
ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైన || 2 ||
నా యేసుతో కలిసి అడుగుపెడతాను ఆ పర దేశములో || 2 ||
సాగిపోతున్న నా యేసుతో || పరదేశి ||