శాశ్వతమైనది నీవు

Sasvatamainadi Nivu

13 Jan 2026
శాశ్వతమైనది నీవు నాయెడ చూపిన కృప అనుక్షణం నను కనుపాపవలె || 2 || కాచిన కృప ||శాశ్వతమైనది|| నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి || 2 || నిత్య సుఖశాంతియే నాకు నీదు కౌగిలిలో || 2 || ||శాశ్వత|| తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే || 2 || నీదు ముఖకాంతియే నన్ను ఆదరించెనులే || 2 || ||శాశ్వత|| పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన || 2 || నా కృప నిను వీడదని అభయమిచ్చితివే || 2 || ||శాశ్వత||