ఆకాశమందు నీవుండగా

Akasamandu Nivundaga

11 Dec 2025
ఆకాశమందు నీవుండగా నేను ఎవరికి భయపడను నీవీ లోకములో నాకుండగా నేను దేనికి భయపడను || 2 || శత్రుసమూహము నన్ను చుట్టినా సైతనుడు సంహరింపజూసినా || 2 || నా సహవాసిగా నీవుండగా నేను ఎవరికి భయపడను || 2 || ||ఆకాశమందు|| వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు || 2 || మరణము మ్రింగగ కాంక్షించినా నేను దేనికి భయపడను || 2 || ||ఆకాశమందు|| పడిపోయిన వెనుకంజ వేయక పశ్చాత్తాపము పడి అడుగు || 2 || నిను క్షమియించును నీ ప్రభువే నీవు ఎవరికి భయపడకు || 2 || ||ఆకాశమందు||