దేవాది దేవుడు మహోపకారుడు
Devadi Devudu Mahopakarudu
11 Feb 2026
దేవాది దేవుడు మహోపకారుడు
మహాత్యము గల మహారాజు || 2 ||
ప్రభువుల ప్రభువు – రాజుల రాజు
ఆయన కృప నిరంతరముండును ||దేవాది||
సునాద వత్సరము ఉత్సాహ సునాదము
నూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము || 2 ||
ఉత్తమ దేవుని దానములు || 2 || ||దేవాది||
యుగములకు దేవుడవు ఉన్నవాడవనువాడవు
జగమంతా ఏలుచున్న జీవాధిపతి నీవే || 2 ||
నీదు క్రియలు ఘనమైనవి || 2 || ||దేవాది||
అద్వితీయ దేవుడవు ప్రభువైన యేసు క్రీస్తు
మహిమా మహాత్యములు సర్వాధిపత్యమును || 2 ||
సదా నీకే కలుగును గాక || 2 || ||దేవాది||