లోయలెల్ల పూడ్చబడాలి

Loyalella Pudcabadali

29 Jan 2026
లోయలెల్ల పూడ్చబడాలి కొండలు కోనలు కదలిపోవాలి వక్రమార్గము సక్రమవ్వాలి కరకు మార్గము నునుపవ్వాలి || 2 || రాజు వస్తున్నాడు ఆయత్తమవుదాం|| 2 || యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదాం || 2 || ఫలం ఇవ్వని చెట్టులెల్ల నరకబడి అగ్నిలో వేయబడును || 2 || || లోయలెల్ల || గోధుమను వేర్పరచి గింజలను చేర్చి పొట్టును నిప్పులో కాల్చివేయును || 2 || || లోయలెల్ల || పరిశుద్ధులుగా మచ్చలు లేక ప్రభుకై జీవించి సాగిపోదాం || 2 || || లోయలెల్ల || రోజు రోజు మేల్కొని ప్రార్ధించెదం అభిషేక తైలముతో నింపబడెదం || 2 || || లోయలెల్ల ||