అసామానుడైన వాడు
Asamanudaina Vadu
19 Apr 2026
అసామానుడైన వాడు
అవమానపరచడునిన్ను
ఓటమిఎరుగనీ మన దేవుడు
ఒడిపోనివ్వడు నిన్ను
ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు
కష్టకాలమందు నీ చేయి విడచునా
అసాధ్యములెన్నో దాటించిన నాథుడు
శ్రమలో నిన్ను దాటిపోవునా
సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు
కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును || 2 ||
అగ్ని గుండాములో నెట్టివేసిన
సింహాల నోటికి నిన్ను అప్పగించిన
శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న
సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన
నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ –
తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై || 2 ||
శత్రువు చేతికి నిన్ను అప్పగించడు || 2 || || సియోను ||
పరిస్థితులన్నీ చేజారిపోయిన
ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నా
అనుకున్నవన్నీ దూరమైపోయిన
మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా
మరది తలరాతని దిగులుపడకుమా –
మారానుమధురముగా మార్చానునీకై || 2 ||
మేలులతో నిను తృప్తిపరచును || 2 || || సియోను ||
ఒంటరి పోరాటమే విసుగురేపిన
పొందిన పిలుపే బారమైపోయిన
ఆత్మీయులందరు అవమానిస్తున్న
నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన
పిలుపునే విడచి మరలిపోకుమా –
న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను || 2 ||
పిలిచిన దేవుడు నిను మరచిపోవునా || 2 || || సియోను ||