పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపినవాడవు
Parisuddha Atmuda Yesu Pampinavadavu
18 Dec 2025
పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపినవాడవు నీవేగా || 2 ||
సర్వాధికారి సత్యస్వరూపి ఇప్పడే దిగిరమ్మయా || 2 ||
నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయ్యా
మనం కలిసి ఉండాలయ్యా || 2 || || పరిశుద్ధ ||
యేసుతో ఉండాలని యేసులాగా మారాలని నా ఆశయ్యా || 2 ||
నన్ను యేసువలే మార్చుటకు పంపబడినవాడా ఇప్పడే దిగిరమ్మయ్యా || 2 || || పరిశుద్ధ ||
తండ్రిని చూడాలని తండ్రి చిత్తం చెయ్యాలని నా ఆశయ్యా || 2 ||
నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడినవాడా ఇప్పడే దిగిరమ్మయా || 2 || || పరిశుద్ధ ||
నీతోనే ఉండాలని నీతో ఏకం కావాలని నా ఆశయ్యా
నాతో సదకాలం ఉండుటకు పంపబడినవాడా ఇప్పడే దిగిరమ్మయా || 2 || || పరిశుద్ధ ||
సత్యములో నడవాలని సత్యం నాకు తెలియాలని నా ఆశయ్యా || 2 ||
సర్వసత్యములో నడుపుటకు పంపబడినవాడా ఇప్పడే దిగిరమ్మయా || 2 || || పరిశుద్ధ ||