ఎన్ని తలచినా ఏది అడిగినా

Enni Talacina Edi Adigina

04 Jan 2026
ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే || 2 || ప్రభువా నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా || 2 || ప్రభువా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు || 2 || అడవి పూవులే నీ ప్రేమ పొందగా || 2 || నా ప్రార్థన ఆలకించుమా || 2 || ప్రభువా ||ఎన్ని|| నా ఇంటి దీపం నీవే అని తెలసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి || 2 || ఆరిపోయిన నా వెలుగు దీపము || 2 || వెలిగించుము నీ ప్రేమతో || 2 || ప్రభువా ||ఎన్ని|| ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి || 2 || లోకమంతయూ నన్ను విడచినా || 2 || నీ నుండి వేరు చెయ్యవు || 2 || ప్రభువా ||ఎన్ని|| నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి || 2 || నీదు యాగమే నా మోక్ష మార్గము || 2 || నీయందే నిత్యజీవము || 2 || ప్రభువా ||ఎన్ని||