అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు
Abrahamu Issaku Yakobunaku
28 Jan 2026
అబ్రాహాము ఇస్సాకు యాకోబునకు దేవుడవు
(యేసయ్యా) భూ రాజులందరికి భూ జనులందరికి పూజ్యుడవు – || 2 || ||అబ్రాహాము||
అబ్రాహాము విశ్వాసులకు తండ్రి అని
ఇస్సాకునకు ప్రతిగా గొరియపిల్లనిచ్చి || 2 ||
యాకోబును ఇశ్రాయేలని దీవించి
ఈ పాపిని నీవు విడువక ప్రేమించి
నా మంచి యేసయ్యా – నీవున్న చాలయ్యా
నీ చేతి నీడలో జీవింతునయ్యా || 2 || ||అబ్రాహాము||
జీవాహారము నేనే అని పలికితివి
జీవ జలముల ఓరన నను నాటితివి || 2 ||
నిర్జీవమైన నన్ను సజీవునిగా చేసి
హృదయము నుండి జీవ జలములు పుట్టించి
నీ జీవాహారము – నీ జీవజలమును
నాకిచ్చినందుకు స్తోత్రము చెల్లింతును || 2 || ||అబ్రాహాము||