ఎగురుచున్నది విజయ పతాకం

Egurucunnadi Vijaya Patakam

13 Feb 2026
ఎగురుచున్నది విజయ పతాకం యేసు రక్తమే మా జీవిత విజయం || 2 || రోగ ధు:ఖ వ్యసనములను తీర్చివేయును సుఖజీవనం చేయుటకు శక్తినిచ్చును 2 రక్తమే – రక్తమే – రక్తమే – యేసు రక్తమే రక్తమే జయం – యేసు రక్తమే జయం యేసునినామం ఉచ్చరింపగనే సాతాను సైన్యము వణుకు చున్నది 2 వ్యాధుల బలము నిర్మూలమైనది జయం పొందెడి నామము నమ్మినప్పుడే 2 దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం ఎడతెగకుండగ మనము స్మరణచేయుదం 2 పాపపు క్రియలన్నిటిని చెదర గొట్టిన క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం 2 మా ప్రేమ వైద్యుడా ప్రాణనాధుడా ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా 2 నీ పాద పద్మముపై చేరియున్న ప్రజలను స్వస్థపరచుము తండ్రి ఈ క్షణమందే 2