అంతా నా మేలుకే
Anta Na Meluke
Zion
19 Dec 2025
నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ || 2 ||
అంతా నా మేలుకే – ఆరాధన యేసుకే
అంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితే
తన చిత్తమునకు తల వంచితే
ఆరాధన ఆపను – స్తుతియించుట మానను || 2 ||
స్తుతియించుట మానను
కన్నీళ్లే పానములైనా – కఠిన దుఃఖ బాధలైనా
స్థితి గతులే మారినా – అవకాశం చేజారినా || 2 ||
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ || 2 ||
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ || 2 || ||అంతా||
ఆస్తులన్ని కోల్పోయినా – కన్నవారే కనుమరుగైనా
ఊపిరి భరువైనా – గుండెలే పగిలినా || 2 ||
యెహోవా ఇచ్చెను – యెహోవా తీసుకొనెను || 2 ||
ఆయన నామమునకే – స్తుతి కలుగు గాక || 2 || ||అంతా||
అవమానం ఎంతైనా – నా వారే కాదన్నా
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున || 2 ||
నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు || 2 ||
నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు || 2 || ||అంతా||
ఆశలే సమాధియైనా – వ్యాధి బాధ వెల్లువైనా
అధికారం కొప్పుకొని – రక్షణకై ఆనందింతును || 2 ||
నాదు మనస్సు నీ మీద – ఆనుకొనగా ఓ నాథా || 2 ||
పూర్ణ శాంతి నే పొంది – నిన్నే నే కీర్తింతున్ || 2 || ||అంతా||
చదువులే రాకున్నా – ఓటమి పాలైనా
ఉద్యోగం లేకున్నా – భూమికే భరువైనా || 2 ||
నా యెడల నీ తలంపులు – ఎంతో ప్రియములు || 2 ||
నీవుద్దేశించినది – నిశ్ఫలము కానేరదు || 2 || ||అంతా||
సంకల్పన పిలుపొంది – నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి – మేలుకై జరుగును || 2 ||
యేసుని సారూప్యము – నేను పొందాలని || 2 ||
అనుమతించిన ఈ – విలువైన సిలువకై || 2 || ||అంతా||
నీవు చేయునది – నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను – తెలిసికొందును || 2 ||
ప్రస్తుతము సమస్తము – దుఃఖ కరమే || 2 ||
అభ్యసించిన నీతి – సమాధాన ఫలమే || 2 || ||అంతా||