యేసు రక్తము

Yesu Raktamu

04 Jan 2026
యేసు రక్తము రక్తము రక్తము || 2 || అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము ||యేసు రక్తము|| ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము || 2 || బహు దు:ఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే || 2 || ||యేసు రక్తము|| మనస్సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము || 2 || మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను || 2 || ||యేసు రక్తము|| మహా పరిశుద్ద స్థలములో చేర్చును మన యేసయ్య రక్తము || 2 || మన ప్రధాన యాజకుడు మన కంటె ముందుగా వెళ్ళెను || 2 || ||యేసు రక్తము||