పరిశుద్ధుడా పావనుడా

Parisuddhuda Pavanuda

14 Feb 2026
పరిశుద్ధుడా పావనుడా అత్యున్నతుడా నీవే || 2 || నీ నామమునే స్తుతియించెదా నీ నామమునే ఘనపరచెదా || 2 || నీలోనే రక్షణ నీలోనే నిరీక్షణ నీలోనే విజయము నీలోనే సంతోషం ఆరాధన నీకే – ఆరాధన నీకే ఆరాధన నీకే || 2 || నా అడుగులో అడుగై నా శ్వాసలో శ్వాసై నే నడచిన వేళలో ప్రతి అడుగై || 2 || నా ఊపిరి నా గానము నా సర్వము నీవే నా యేసయ్యా నీకేనయ్యా ఆరాధన ||ఆరాధన|| నాపై నీ ఆత్మను కుమ్మరించుము యేసయ్యా నీ శక్తితో నను నింపు బలవంతుడా || 2 || ||ఆరాధన||