గూడు లేని గువ్వనై–కూడు లేని బిడ్డనై
Gudu Leni Guvvanaikudu Leni Biddanai
28 Oct 2025
గూడు లేని గువ్వనై – కూడు లేని బిడ్డనై || 2 ||
నీడ లేని మనిషినై – అందరిలో ఒంటరినై || 2 ||
దారి తెలియని స్థితిలో నిలబడి ఉన్నాను
సహాయము కొరకు ఆర్జిస్తు ఉన్నాను || 2 ||
అప్పుడొక మెల్లని స్వరము నాతో
మాట్లాడి చెప్పెను ప్రభువైన యేసుని || 2 ||
ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను
నా జీవితమంత ప్రకాశింప సాగింది || 2 || ||గూడు||
అప్పుడొక తియ్యని స్వరము నాతో
మాట్లాడి చెప్పెను ప్రియుడైన యేసుని || 2 ||
ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను
నా పాప జీవితము పారిపో సాగింది || 2 || ||గూడు||
అప్పుడొక అద్భుత స్వరము నాతో
మాట్లాడి చెప్పెను రాజైన యేసుని || 2 ||
ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను
నా ప్రశ్నలన్నిటికి జవాబులు దొరికాయి || 2 ||
గూడు ఉన్న గువ్వనై – కూడు ఉన్న బిడ్డనై || 2 ||
నీడ ఉన్న మనిషినై – ఒక్కరిలో వెయ్యినై || 2 ||
దారి తెలిసిన స్థితిలో నిలబడి ఉన్నాను
సేవలోని మాధుర్యము ననుభవిస్తున్నాను || 2 ||
యేసుని నమ్ముకో – యేసుని చేరుకో
యేసుని కోరుకో – యేసుతో చేరిపో (4)