విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా
Vijayasiluda Na Prana Priyuda
27 Dec 2025
విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా
కృతజ్ఞతతో నిను స్తుతించెదను || 2 ||
నా యేసయ్యా నిను వేడుకొనగా
నా కార్యములన్నియు సఫలము చేసితివి || 2 || ||విజయశీలుడా||
అలసిన సమయమున – నా ప్రాణములో త్రాణ పుట్టించినావు – || 2 ||
ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు || 2 ||
నిత్యానందము కలిగించె నీ
శుభ వచనములతో – నెమ్మదినిచ్చితివి || 2 || ||విజయశీలుడా||
ఆశ్చర్యకరముగ – నీ బాహువు చాపి విడుదల కలిగించినావు – || 2 ||
అరణ్య మార్గమున విడువక తోడై విజయముతో నడిపినావు || 2 ||
నీ స్వాస్థ్యమునకు తండ్రిగ నిలిచి
వాగ్ధాన భూమిలో – చేర్చిన దేవా || 2 || ||విజయశీలుడా||
ఆరోగ్యకరమైన నీ – రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు – || 2 ||
అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు || 2 ||
నిత్యము నీతో నేనుండుటకై
నూతన యెరూషలేము నిర్మించుచున్నావు || 2 || ||విజయశీలుడా||