బహు సౌందర్య సీయోనులో
Bahu Saundarya Siyonulo
Hosanna Ministers
04 Jan 2026
బహు సౌందర్య సీయోనులో
స్తుతిసింహాసనాసీనుడా – || 2 ||
నాయేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై
నా హృదయాన కొలువాయెనే
ననుజీవింపజేసే నీవాక్యమే
నాకిలలోన సంతోషమే
పరిశుద్ధతలో మహనీయుడవు
నీవంటిదేవుడు జగమునలేడు || 2 ||
నాలో నిరీక్షణ నీలో సంరక్షణ
నీకే నాహృదయార్పణ || 2 || ||బహు||
ఓటమినీడలో క్షేమములేక
వేదనకలిగిన వేళలయందు || 2 ||
నీవు చూపించిన నీ వాత్సల్యమే
నాహృదయాన నవజ్ఞాపిక || 2 || ||బహు||
ఒంటరిబ్రతుకులో కృంగినమనసుకు
చల్లని నీచూపే ఔషధమే || 2 ||
ప్రతి అరుణోదయం నీ ముఖదర్శనం
నాలోనింపెను ఉల్లాసమే || 2 || ||బహు||