సర్వోన్నతుడా

Sarvonnatuda

Bro. Yesanna Garu 22 Mar 2026
సర్వోన్నతుడా - నీవే నాకు ఆశ్రయదుర్గము || 2 || ఎవ్వరులేరు - నాకు ఇలలో || 2 || ఆదరణ నీవెగా -ఆనందం నీవెగా || 2 || నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట - నిలువలేరని యెహోషువాతో || 2 || వాగ్దానము చేసినావు - వాగ్దానా భూమిలో చేర్చినావు || 2 || || సర్వో || నిందలపాలై నిత్య నిబంధన - నీతో చేసిన దానియేలుకు || 2 || సింహాసనమిచ్చినావు - సింహాల నోళ్లను మూసినావు || 2 || || సర్వో || నీతి కిరీటం దర్శనముగా - దర్శించిన పరిశుద్ధ పౌలుకు || 2 || విశ్వాసము కాచినావు - జయజీవితము నిచ్చినావు || 2 || || సర్వో ||