నీ మాట జీవముగలదయ్యా

Ni Mata Jivamugaladayya

21 Dec 2025
నీ మాట జీవముగలదయ్యా యేసయ్యా నీ మాట సత్యముగలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా నీ మాట మరిచిపోనిదయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట బంధించబడిన వారిని విడిపించును నీ మాట || 2 || త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట|| 2 || || నీ మాట || సింహాల బోనులో నుండి విడిపించును నీమాట అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట || 2 || మారా బ్రతుకును కూడ మధురం చేయును నీ మాట ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట || 2 || || నీ మాట ||