నిను మాత్రమే నే నమ్మానయ్యా

Ninu Matrame Ne Nammanayya

15 Feb 2026
నిను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా || 2 || నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటిని సరిచేయును || 2 || కృప చూపువాడవయా నీ పిల్లలకు || 2 || ||నిను మాత్రమే|| నీవు సెలవియ్యగా కలుగనిదేముంది వాక్కును పంపగా జరుగనిదేముంది || 2 || సకలము నీదెనయా శ్రీమంతుడా స్తుతి నీకు పాడెదనయా || 2 || సమకూర్చువాడవయా నీ పిల్లలకు || 2 || ||నిను మాత్రమే|| నా ముందు నీవుండగా ఎదురొచ్చువాడెవడు కార్యము చేయగా అడ్డుపడువాడెవడు || 2 || యుద్ధము నీదెనయా ఓ శూరుడా ముందుకు సాగెదనయా || 2 || జయమిచ్చువాడవయా నీ పిల్లలకు || 2 || ||నిను మాత్రమే|| నీవు కరుణించగా కాదనువాడెవడు శక్తితో నింపగా ఓడించువాడెవడు || 2 || సాయము నీదెనయా సహాయకుడా నీలో దాగెదనయా || 2 || బలమిచ్చువాడవయా నీ పిల్లలకు || 2 || ||నిను మాత్రమే||