హల్లెలుయా పాడెదా
Halleluya Padeda
Zion
11 Apr 2026
హల్లెలుయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్ || 2 ||
అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును || 2 ||
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||
వాగ్ధానములనిచ్చి
నెరవేర్చువాడవు నీవే || 2 ||
నమ్మకమైన దేవా
నన్ను కాపాడువాడవు నీవే || 2 ||
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||
ఎందరు నిను చూచిరో
వారికి వెలుగు కల్గెన్ || 2 ||
ప్రభువా నీ వెలుగొందితిన్
నా జీవంపు జ్యోతివి నీవే || 2 ||
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||
కష్టములన్నింటిని
ప్రియముగా భరియింతును || 2 ||
నీ కొరకే జీవింతును
నా జీవంపు దాతవు నీవే || 2 ||
ప్రభువా నిన్ను నే కొనియాడెదన్ ||హల్లెలుయా||