కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినం
Kurcundunu Ni Sannidhilo Deva Prati Dinam
Joseph Konda
14 Dec 2025
కూర్చుందును నీ సన్నిధిలో – దేవా ప్రతి దినం
ధ్యానింతును నీ వాక్యమును – దేవా ప్రతి క్షణం || 2 ||
నిరంతరం నీ నామమునే గానము చేసెదను
ప్రతి క్షణం నీ సన్నిధినే అనుభవించెదను ||కూర్చుందును||
ప్రతి విషయం నీకర్పించెదా
నీ చిత్తముకై నే వేచెదా || 2 ||
నీ స్ఫూర్తిని పొంది నే సాగెదా || 2 ||
నీ నామమునే హెచ్చించెదా || 2 ||
నా అతిశయము నీవే – నా ఆశ్రయము నీవే
నా ఆనందము నీవే – నా ఆధారము నీవే
యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును||
ప్రతి దినము నీ ముఖ కాంతితో
నా హృదయ దీపం వెలిగించెదా || 2 ||
నీ వాక్యానుసారము జీవించెదా || 2 ||
నీ ఘన కీర్తిని వివరించెదా || 2 ||
నా దుర్గము నీవే – నా ధ్వజము నీవే
నా ధైర్యము నీవే – నా దర్శనం నీవే
యేసూ యేసూ యేసూ యేసూ.. ||కూర్చుందును||