బెత్లెహేములో సందడి
Betlehemulo Sandadi
18 Nov 2025
బెత్లెహేములో సందడి
పశుల పాకలో సందడి
శ్రీ యేసు పుట్టాడని
మహారాజు పుట్టాడని || 2 || ||బెత్లెహేములో||
ఆకాశములో సందడి
చుక్కలలో సందడి || 2 ||
వెలుగులతో సందడి
మిల మిల మెరిసే సందడి || 2 || ||బెత్లెహేములో||
దూతల పాటలతో సందడి
సమాధాన వార్తతో సందడి || 2 ||
గొల్లల పరుగులతో సందడి
క్రిస్మస్ పాటలతో సందడి || 2 || ||బెత్లెహేములో||
దావీదు పురములో సందడి
రక్షకుని వార్తతో సందడి || 2 ||
జ్ఞానుల రాకతో సందడి
లోకమంతా సందడి || 2 || ||బెత్లెహేములో||