ప్రియ యేసు రాజును
Priya Yesu Rajunu
Zion
21 Dec 2025
ప్రియ యేసు రాజును నే చూచిన చాలు
మహిమలో నేనాయనతో ఉంటే చాలు || 2 ||
నిత్యమైన మోక్షగృహము నందు చేరి
భక్తుల గుంపులో హర్షించిన చాలు || 2 || ||ప్రియ యేసు||
యేసుని రక్తమందు కడుగబడి
వాక్యంచే నిత్యం భద్రపరచబడి || 2 ||
నిష్కలంక పరిశుధ్దులతో పేదన్ నేను || 2 ||
బంగారు వీదులలో తిరిగెదను || 2 || ||ప్రియ యేసు||
ముండ్ల మకుటంబైన తలను జూచి
స్వర్ణ కిరీటం బెట్టి ఆనందింతున్ || 2 ||
కొరడాతో కొట్టబడిన వీపున్ జూచి || 2 ||
ప్రతి యొక్క గాయమును ముద్దాడెదన్ || 2 || ||ప్రియ యేసు||
హృదయము స్తుతులతో నింపబడెను
నా భాగ్య గృహమును స్మరించుచు || 2 ||
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ || 2 ||
వర్ణింప నా నాలుక చాలదయ్యా || 2 || ||ప్రియ యేసు||
ఆహ ఆ బూర ఎప్పుడు ధ్వనించునో
ఆహ నా ఆశ ఎప్పుడు తీరుతుందో || 2 ||
తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో || 2 ||
ఆశతో వేచియుండే నా హృదయం || 2 || ||ప్రియ యేసు||