ఎబినేజరే ఎబినేజరే

Ebinejare Ebinejare

21 Dec 2025
నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానక స్తుతించెదము || 2 || నీ కనుపాప వలె నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం || 2 || ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడచితివే || 2 || స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం ||నేను|| ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే || 2 || ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావు స్తోత్రం || 2 || ||ఎబినేజరే|| నిరాశతో ఉన్న నా హీన బ్రతుకును నీ కృపతో నింపితివే || 2 || నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి || 2 || ||ఎబినేజరే|| జ్ఞానుల మధ్యలో నను పిలిచిన నీ పిలుపే ఆశ్చర్యమాశ్చర్యమే || 2 || నీ పాత్రను కానే కాను కేవలము నీ కృపయే స్తోత్రం || 2 || ||ఎబినేజరే||