ar'hata lekunna preminchavu

అర్హత లేకున్నా ప్రేమించావు

A R Stevenson 02 Aug 2026

అర్హత లేకున్నా ప్రేమించావు – ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు – ఇది కేవలం నీ కృపయే || 2 || కృపయే.. కృపయే.. నేనేమైయున్నానో నీ కృపయే కృపయే.. కృపయే.. నే బ్రతికి ఉన్నానంటే కృపయే || 2 || లోకము నన్ను ఆకర్షింపగా అల్లరితనము నా చుట్టు చేరగా ఓటమి నా బ్రతుకును హేళన చేయగా నీ కృపతో నన్ను బలపరచితివే || 2 || ఇంతగ నన్ను హెచ్చించుటకు ఏ పాటివాడను యేసయ్యా || 2 || నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను || 2 || ||కృపయే|| శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానముచే నే హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టు చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే || 2 || ఇంతగ నన్ను ప్రేమించుటకు ఏ పాటివాడను యేసయ్యా || 2 || నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను || 2 || ||కృపయే||

English Transliteration (or) Lyrics

ar'hata lekunna preminchavu - idi kevalam ni krpaye yogyata lekunna hechchinchavu - idi kevalam ni krpaye || 2 || krpaye.. krpaye.. nenemaiyunnano ni krpaye krpaye.. krpaye.. ne bratiki unnanante krpaye || 2 || lokamu nannu akarsimpaga allaritanamu na chuttu cheraga otami na bratukunu helana cheyaga ni krpato nannu balaparachitive || 2 || intaga nannu hechchinchutaku e pativadanu yesayya || 2 || ni krpaku ellappudu krtajnudanu || 2 || ||krpaye|| sramalu sodhanalu nannavarimpaga ajnanamuche ne hinamavvaga maranapu koralu na chuttu cheraga ni krpato nannu bratikinchitive || 2 || intaga nannu preminchutaku e pativadanu yesayya || 2 || ni krpaku ellappudu krtajnudanu || 2 || ||krpaye||