nivu na todu unnavayya

నీవు నా తోడు ఉన్నావయ్యా

28 Jun 2026

నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేల నా యేసయ్యా నీవు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేల నా మెస్సయ్యా నాకు భయమేల నాకు దిగులేల నాకు చింతేల నాకు భీతి ఏల ||నీవు|| కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు (2) అడిగిన వారికి ఇచ్చేవాడవు వెదకిన వారికి దొరికేవాడవు (2) తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు (2) నేనే సత్యం అన్న దేవా నేనే మార్గం అన్న దేవా (2) నేనే జీవము అని పలికిన దేవా (2) దేవా దేవా నీకే స్తోత్రం (4) ||నీవు||

English Transliteration (or) Lyrics

nivu na todu unnavayya naku bhayamela na yesayya nivu nalone unnavayya naku digulela na mes'sayya naku bhayamela naku digulela naku chintela naku bhiti ela ||nivu|| kastamulo nastamulo na todu unnavu vedanalo avedanalo na chenta unnavu (2) adigina variki ichchevadavu vedakina variki dorikevadavu (2) tattina variki talupulu teriche devudavu (2) deva deva nike stotram (4) vyadhulalo badhalalo uratanichchavu raksanalo sanraksakudai dhairyamu panchavu (2) nene satyam anna deva nene margam anna deva (2) nene jivamu ani palikina deva (2) deva deva nike stotram (4) ||nivu||