ilatida yesu prema
ఈలాటిదా యేసు ప్రేమ
ఈలాటిదా యేసు ప్రేమ -నన్ను తూలనాడక తనదు జాలి చూపినదా ||ఈలాటిదా|| ఎనలేని పాప కూపమున – నేను తనికి మిణుకుచును నే దరి గానకుండన్ కనికరము పెంచి నాయందు – వేగ గొనిపోవ నా మేలు కొరికిందు వచ్చె ||ఈలాటిదా|| పెనుగొన్న దుఃఖాబ్ధిలోన – నేను మునిగి కుములుచు నేడు పునగుండు నపుడు నను నీచుడని త్రోయలేక – తనదు నెనరు నా కగుపరచి నీతి జూపించె ||ఈలాటిదా|| నెమ్మి రవ్వంతైనా లేక – చింత క్రమ్మిపొగలుచు నుండ-గా నన్ను జూచి సమ్మతిని నను బ్రోవ దలచి – కరము జాచి నా చేయి బట్టి చక్కగా పిలిచె ||ఈలాటిదా|| పనికిమాలిన వాడనైన – నేను కనపరచు నా దోష కపటవర్తనము మనసు నుంచక తాపపడక యింత ఘనమైన రక్షణ-మును నాకు చూపె ||ఈలాటిదా|| నా కోర్కెలెల్ల సమయములన్ – క్రింది లోక వాంఛల భ్రమసి లొంగెడు వేళన్ చేకూర్చి ధృడము చిత్తమునన్ – శుభము నా కొసంగె జీవింప నా రక్షకుండు ||ఈలాటిదా|| శోధనలు నను చుట్టినప్పుడు – నీతి బోధ నా మనసులో పుట్టించి పెంచి బాధలెల్లను బాపి మాపి – యిట్టి యాదరణ జూపిన యహాఁహాఁ యేమందు ||ఈలాటిదా||
English Transliteration (or) Lyrics
ilatida yesu prema -nannu tulanadaka tanadu jali chupinada ||ilatida|| enaleni papa kupamuna - nenu taniki minukuchunu ne dari ganakundan kanikaramu penchi nayandu - vega gonipova na melu korikindu vachche ||ilatida|| penugonna duhkhabdhilona - nenu munigi kumuluchu nedu punagundu napudu nanu nichudani troyaleka - tanadu nenaru na kaguparachi niti jupinche ||ilatida|| nem'mi ravvantaina leka - chinta kram'mipogaluchu nunda-ga nannu juchi sam'matini nanu brova dalachi - karamu jachi na cheyi batti chakkaga piliche ||ilatida|| panikimalina vadanaina - nenu kanaparachu na dosa kapatavartanamu manasu nunchaka tapapadaka yinta ghanamaina raksana-munu naku chupe ||ilatida|| na korkelella samayamulan - krindi loka vanchhala bhramasi longedu velan chekurchi dhrdamu chittamunan - subhamu na kosange jivimpa na raksakundu ||ilatida|| sodhanalu nanu chuttinappudu - niti bodha na manasulo puttinchi penchi badhalellanu bapi mapi - yitti yadarana jupina yahamham yemandu ||ilatida||