ni prema nalo
నీ ప్రేమ నాలో
నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము ||2|| ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించి నాలో మహిమపరతు నిన్నే సర్వకృపానిధి నీవు – సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు – ఆరాధింతును నిన్నే ||నీ ప్రేమ|| చేరితి నిన్నే విరిగిన మనస్సుతో కాదనలేదే నా మనవులు నీవు ||2|| హృదయము నిండిన గానం – నను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే – చెరగని దివ్య రూపం ||2|| ఇది నీ బాహు బంధాల అనుబంధమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే ||2|| ||నీ ప్రేమ|| నా ప్రతి పదములో జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే ||2|| ఎన్నడు విడువని ప్రేమ – నిను చేరే క్షణము రాదా నీడగా నాతో నిలిచే – నీ కృపయే నాకు చాలును ||2|| ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే ||2|| ||నీ ప్రేమ|| నీ సింహాసనము నను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి ||2|| కొండలు లోయలు దాటే – మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి – సమాభూమిపై నడిపినావు ||2|| ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే ||2|| ||నీ ప్రేమ||
English Transliteration (or) Lyrics
ni prema nalo madhuramainadi adi na uhakandani ksema sikharamu ||2|| eri korukunnavu prema chupi nannu paravasinchi nalo mahimaparatu ninne sarvakrpanidhi nivu - sarvadhikarivi nivu satya svarupivi nivu - aradhintunu ninne ||ni prema|| cheriti ninne virigina manas'suto kadanalede na manavulu nivu ||2|| hrdayamu nindina ganam - nanu nadipe prema kavyam niratamu nalo nive - cheragani divya rupam ||2|| idi ni bahu bandhala anubandhama tejoviraja stuti mahimalu nike na yesuraja aradhana nike ||2|| ||ni prema|| na prati padamulo jivamu nive na prati adugulo vijayamu nive ||2|| ennadu viduvani prema - ninu chere ksanamu rada nidaga nato niliche - ni krpaye naku chalunu ||2|| idi ni prema kuripinchu hemantama tejoviraja stuti mahimalu nike na yesuraja aradhana nike ||2|| ||ni prema|| ni sinhasanamu nanu cherchutaku siluvanu moyuta nerpinchitivi ||2|| kondalu loyalu date - mahimatmato nimpinavu dayagala atmato nimpi - samabhumipai nadipinavu ||2|| idi ni atma bandhamukai sanketama tejoviraja stuti mahimalu nike na yesuraja aradhana nike ||2|| ||ni prema||