nito polchutaku sarvesa

నితో పోల్చుటకు సర్వేశా

30 Aug 2026

నితో పోల్చుటకు సర్వేశా - ఎవ్వరును లేరు ప్రభూశా ||2|| స్తుతి పాడుటకు యేసునాధా - చాలవు పదివేల నాలుకలు ||2|| నిజముగ యేసు పరిశుద్ధుడు - పరమ దేవుని చూడుటకు ||2|| స్తుతులతోను కవిత్వముతో - దేవ దేవుని చేరెదము ||2|||నితో|| చేతి పటములు రాక్కు మన్ను - మనకు దైవములకానేవరు ||2|| ఆత్మతోను సత్యముతో - ఆరాధింతము మన దేవుని ||2|||నితో|| నశించును వెండి బంగారము - లోక మాయలు గతియించును ||2|| విలువైనది స్థిరమైనది - యేసు నాధు నీ కృపావరమే ||2|||నితో|| దైవ సుతుడుగ అవతరించెన్ - పాప శోధనలు తొలగించెన్ ||2|| నరులకై జీవమిచ్చెన్ - నశించు జనులను రక్షించెన్ ||2|||నితో|| పొంగుచుండిన అలలను - తొక్కుకున్నడు వంతి ప్రభువు ||2|| అణగిపోవున్ గద్దించగానే - అద్భుత మనము చేయుటకు ||2|||నితో|| జీవమిచ్చి లేచెను ప్రభువు - జీవ దేవుడు విజయుడయ్యెన్ ||2|| యేసుప్రభువు తిరిగి వచ్చున్ - సమీపించును ఆ శుభ దినము ||2|||నితో||

English Transliteration (or) Lyrics

nito polchutaku sarvesa - evvarunu leru prabhusa ||2|| stuti padutaku yesunadha - chalavu padivela nalukalu ||2|| nijamuga yesu parisud'dhudu - parama devuni chudutaku ||2|| stutulatonu kavitvamuto - deva devuni cheredamu ||2|||nito|| cheti patamulu rakku mannu - manaku daivamulakanevaru ||2|| atmatonu satyamuto - aradhintamu mana devuni ||2|||nito|| nasinchunu vendi bangaramu - loka mayalu gatiyinchunu ||2|| viluvainadi sthiramainadi - yesu nadhu ni krpavarame ||2|||nito|| daiva sutuduga avatarinchen - papa sodhanalu tolaginchen ||2|| narulakai jivamichchen - nasinchu janulanu raksinchen ||2|||nito|| ponguchundina alalanu - tokkukunnadu vanti prabhuvu ||2|| anagipovun gaddinchagane - adbhuta manamu cheyutaku ||2|||nito|| jivamichchi lechenu prabhuvu - jiva devudu vijayudayyen ||2|| yesuprabhuvu tirigi vachchun - samipinchunu a subha dinamu ||2|||nito||