trahimam kristu natha

త్రాహిమాం క్రీస్తు నాథ

Purushotham Chaudhary 16 Jul 2026

త్రాహిమాం క్రీస్తు నాథ – దయ జూడ రావే నేను – దేహి యనుచు నీ పాదములే దిక్కుగా జేరితి నిపుడు ||త్రాహిమాం|| గవ్వ చేయరాని చెడ్డ – కర్మేంద్రియాధీనుడనై రవ్వ పాలై నేనెంతో – నెవ్వ బొందితి త్రవ్వుచున్న కొలది – పెరుగు – దరగదు నా పాప రాశి యివ్విధమున జెడిపోతిని నే – నేమి సేతు నోహోహోహో ||త్రాహిమాం|| నీ యందు భయభక్తులు లేని – నిర్లజ్జా చిత్తము బూని చేయరాని దుష్కర్మములు – చేసినాడను దయ్యాల రాజు చేతిలో – జేయి వేసి వాని పనుల జేయ సాగి నే నిబ్భంగి – జెడిపోయితి నే నయ్యయ్యాయ్యో ||త్రాహిమాం|| నిబ్బర మొక్కించుకైన – నిజము రవ్వంతైన లేక దబ్బర లాడుతకు ము – త్తా నైతిని అబ్బురమైన ఘోర పా – పాంధకార కూపమందు దబ్బున బడిపోతి నయ్యో – దారి చెడి నేనబ్బబ్బబ్బా ||త్రాహిమాం|| నిన్ను జేరి సాటిలేని – నిత్యానంద మంద బోవు చున్నప్పుడు నిందలు నా – కెన్ని చేరినా విన్నదనము లేకుండ నీ – వే నా మదికి ధైర్యమిచ్చి యన్నిట రక్షించితివి నా – యన్న నీకు స్తోత్ర మహాహా ||త్రాహిమాం||

English Transliteration (or) Lyrics

trahimam kristu natha - daya juda rave nenu - dehi yanuchu ni padamule dikkuga jeriti nipudu ||trahimam|| gavva cheyarani chedda - karmendriyadhinudanai ravva palai nenento - nevva bonditi travvuchunna koladi - perugu - daragadu na papa rasi yivvidhamuna jedipotini ne - nemi setu nohohoho ||trahimam|| ni yandu bhayabhaktulu leni - nirlajja chittamu buni cheyarani duskarmamulu - chesinadanu dayyala raju chetilo - jeyi vesi vani panula jeya sagi ne nibbhangi - jedipoyiti ne nayyayyayyo ||trahimam|| nibbara mokkinchukaina - nijamu ravvantaina leka dabbara ladutaku mu - tta naitini abburamaina ghora pa - pandhakara kupamandu dabbuna badipoti nayyo - dari chedi nenabbabbabba ||trahimam|| ninnu jeri satileni - nityananda manda bovu chunnappudu nindalu na - kenni cherina vinnadanamu lekunda ni - ve na madiki dhairyamichchi yannita raksinchitivi na - yanna niku stotra mahaha ||trahimam||