ఇన్నాళ్లు తోడుగా
Innallu Toduga
A R Stevenson
31 Dec 2025
ఇన్నాళ్లు తోడుగా మాతో నడిచావు
ఇమ్మానుయేలుగా వెన్నంటి నిలిచావు || 2 ||
ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము
నిన్నే అనుసరింతుము జీవితాంతము || 2 ||
ఘనులైన వారే గతియించగా
ధనమున్నవారే మరణించగా || 2 ||
ఎన్నతగని వారమైనా మమ్ము కనికరించావు
మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు || 2 || ||ఇశ్రాయేలు||
మా కంట కన్నీరు జారకుండగా
ఏ కీడు మా దరికి చేరకుండగా || 2 ||
కంటి రెప్పలా కాచి భద్రపరచియున్నావు
దుష్టుల ఆలోచనలు భంగపరచియున్నావు || 2 || ||ఇశ్రాయేలు||